ప్రమాదం జరిగితే నష్టం ఎవరికి.
రోడ్డుపై పిల్లలు టూ వీలర్ వాహనాలు నడపడం చూసి ప్రజలు అరే ఏంది గీ చిన్న పోరగాండ్లు బండ్లు నడుపుడేంది వాళ్ళ అయ్యవ్వలు బండ్లు ఇచ్చుడేంది అని మండల ప్రజలు ముచ్చటించుకుంటున్నారు. ఇంట్లో తల్లిదండ్రులు కూడా పిల్లలకు టూవీలర్ వాహనాలు ఇచ్చి ఇంట్లో పనులు చెప్పి పంపిస్తుంటారు. బండిపై కూర్చుంటే సరిగా కాళ్లు కూడా కిందకు అందవు. రోడ్డుపై వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా ఏదైనా పెద్ద వాహనం వస్తే కంట్రోల్ చేసే శక్తి కూడా పిల్లల్లో ఉండదు. ప్రమాదాలకు గురైనప్పుడు బాధపడే కంటే ముందే పిల్లలకు వాహనాలు ఇచ్చుడు పెద్దలు మానుకోవాలి. టిఎస్ మోడల్ స్కూల్ లో చదివే విద్యార్థులు కూడా దూర ప్రాంతం నుండి వచ్చేవాళ్ళు టూ వీలర్ పై ఇద్దరిద్దరూ విద్యార్థులు వస్తుంటారు. పిల్లలు ఎమోషన్ కు గురై వాహనాలను అతివేగంగా నడుపుతుంటారు. అది చూసిన ప్రజలకు వామ్మో అని, పిల్లలపై కేకలు వేస్తుంటారు, అయినా పిల్లలు వాళ్ళ వేగం తగ్గించరు. 18 సంవత్సరములు దాటిన వారు మాత్రమే వాహనాలు నడపాలని రూలు ఉంది. కానీ పిల్లలు, పెద్దలు, అది ఎవరు కూడా పటించుకోకుండా వారి పిల్లల కు తల్లిదండ్రులు పిల్లలకు వాహనాలు ఇస్తుంటారు. ఇది పెద్దలు మానుకోవాలి.
మైనర్లకు వాహనాలు ఇస్తే పెద్దలే బాధ్యులు: ఎస్ ఐ రాజు గౌడ్
మైనర్లకు తల్లిదండ్రులు టూవీలర్ వాహనాలను నడుపుటకు ఇవ్వరాదని ఇచ్చినట్టు ఉంటే తల్లిదండ్రులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఇల్లంతకుంట ఎస్సై ఎల్.రాజు గౌడ్ హెచ్చరించారు. మైనర్లు వాహనాలు నడిపి పట్టుపడితే వాహనాలను సీజ్ చేసి వారి తల్లిదండ్రులపై చార్జిషీటు దాఖలు చేయాల్సి వస్తుందని ఎస్ఐ పేర్కొన్నారు. మైనర్లకు ఎవరు కూడా వాహనాలు ఇవ్వరాదని తల్లిదండ్రులను ఎస్సై కోరారు. ప్రమాదాలకు గురైతే నష్టపోయేది మీరేనని ఇది గ్రహించి పెద్దలు మసులుకోవాలని ఎస్సై పేర్కొన్నారు.