జమ్మికుంట డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం రోజున సద్దుల బతుకమ్మ సందర్భంగా జమ్మికుంట పట్టణ ప్రాంత ప్రజలకు పట్టణ సీఐ వరగంటి రవి శుభాకాంక్షలు తెలిపారు బతుకమ్మ ఏర్పాటులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడానికి విచ్చేసే మహిళలు బంగారు ఆభరణాలతో అలంకరించుకుంటారని ఇదే అదనుగా క్రీడా మైదానంలో దొంగలు సంచరించే అవకాశం ఉన్నందున మహిళలు అప్రమత్తంగా ఉండాలని, చిన్నపిల్లలను ఆటలాడే సమయంలో విడిచిపెట్టరాదని పిల్లల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు…

