ఆర్ఆర్ఆర్.. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే. ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఇప్పటికే పలు అవార్డులను గెలుచుకుంది. అలాగే.. ఈ మూవీలో హీరోలుగా నటించిన రామ్‌చరణ్, ఎన్టీఆర్‌కి ప్రపంచ స్థాయిలో గుర్తింపుని సాధించి పెట్టింది. ఇంతకుముందే గోల్డెన్ గ్లోబ్, హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డులను గెలుచుకోగా.. ప్రస్తుతం ఆస్కార్స్ 2023లో పోటీలో నిలిచింది.
ఈ తరుణంలోనే ‘ఆర్ఆర్ఆర్’పై, రాజమౌళిపై హాలీవుడ్ దిగ్గజ దర్శకులు జేమ్స్ కామెరూన్, స్పీల్ బర్గ్ సైతం ప్రశంసలు కురిపించారు. దీంతో తెలుగు ప్రేక్షకులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. ఈ మూవీకి అవార్డులను సాధించి పెట్టడానికి చిత్రబృందం 80 కోట్లు ఖర్చు చేసిందని టాలీవుడ్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్‌కి ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. తాజాగా సినీయర్ దర్శకులు కే.రాఘవేంద్రరావు సోషల్ మీడియా వేదికగా భరద్వాజ్‌పై విమర్శలు చేశారు.
రాఘవేంద్ర రావు షేర్ చేసిన ట్వీట్‌లో.. ‘మిత్రుడు భరద్వాజ్‌కి, తెలుగు సినిమాకు, తెలుగు సాహిత్యానికి, తెలుగు దర్శకుడికి, తెలుగు నటులకి ప్రపంచ వేదికలపై మొదటిసారి వస్తున్న పేరుని చూసి గర్వపడాలి. అంతేకానీ 80 కోట్ల ఖర్చు అంటూ చెప్పడానికి నీ దగ్గర అకౌంట్ ఇన్‌ఫర్మేషన్ ఏమైనా ఉందా..? జేమ్స్ కామెరూన్, స్పీల్ బర్గ్ వంటి వారు డబ్బు తీసుకొని మన సినిమా గొప్పతనాన్ని పొగుడుతున్నారని నీ ఉద్దేశమా?’ అని సెటైరికల్‌గా రాసుకొచ్చారు.