రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల పోలీస్ స్టేషన్లో విధులు నిర్వాహిస్తున్న కిషన్ రావు పదవి విరమణ పొందగా శుక్రవారం కిషన్ రావు దంపతులను సన్మానించి సత్కరించారు ఎల్లారెడ్డిపేట సీఐ శ్రీనివాస్ గౌడ్ ఎస్ ఐ రమాకాంత్. ఈ సందర్భంగా కిషన్ రావు మాట్లాడుతూ పదవీ విరమణ సహజమేనని తాను ఇన్నేళ్లపాటు వివిధ పోలీస్ స్టేషన్లో విధులు బాధ్యతగా నిర్వహించి పదవి విరమణ పొందానని పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో గత నాలుగేళ్లుగా విధులు నిర్వర్తించిన ఏ ఎస్ ఐ కిషన్ రావు దంపతులకు శ్రీనివాస్ రెడ్డి, సిఐ శ్రీనివాస్ గౌడ్, ఎస్సై రమాకాంత్ సన్మానించి సత్కరించి వీడ్కోలు పలికారు


