మహిళా ఎస్‌ఐ రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ మహిళా ఎస్‌ఐ రాజ్యలక్ష్మి స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు రూ.25 వేలు లంచం డిమాండ్ చేసింది. అందుకు అంగీకరించిన బాధితుడు నేరుగా ఏసీబీ అధికారులను కలిశాడు. వారి సూచనల మేరకు రూ.25 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఆసిఫాబాద్ కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గత నెల 31 వ తేదీన బూరుగుడ సమీపంలో ఆక్సిడెంట్ జరిగినది. ప్రమాదంలో నిందితుడైన యాహ్యా ఖాన్ మంచిర్యాల జిల్లా సిసిసి నస్పూర్ వాసి. అతనికి స్టేషన్ బెయిల్, వాహనము ఇవ్వడానికి ఆసిఫాబాద్ మహిళా ఎస్సై రాజ్యలక్ష్మి 40 వేలు డిమాండ్ చేయగా 25 వేలకు బాధితుడు ఒప్పుకున్నాడు. ఈ క్రమంలో బాధితుడు ఏసీబీని సంప్రదించాడు. ఏసీబీని సంప్రదించాక ఈరోజు స్థానిక పోలీస్ స్టేషన్లో మధ్యాహ్నం మూడు గంటలకు 25వేల లంచం తీసుకుంటూ ఉండగా ఏసిబి డిఎస్పి రమణమూర్తి కి పట్టుబడింది మహిళా ఎస్సై రాజ్యలక్ష్మి. ACB DSP రమణమూర్తి మీడియాతో మాట్లాడుతూ ఎస్సై రాజలక్ష్మిపై కేసు నమోదు చేసి కరీంనగర్ లోని ACB కోర్టుకు హాజరు పరుస్తామని తెలియజేశారు.