కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామివారి ఆశీర్వచనాలు తీసుకున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
కోనరావుపేట మండలంలోని మామిడిపల్లి గ్రామంలొ శ్రీ మహాదేవా శివాలయంలో మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా కన్నుల పండుగగా అర్చకులు కృష్ణ వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య శివ కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శివపార్వతుల కళ్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం వల్ల ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై పూజలు నిర్వహించి దేవతామూర్తుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో వారిని సత్కరించారు. కళ్యాణ తదనంతరం దాతల సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామ ప్రజలు, పరిసర ప్రాంతాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.