దేశానికి ఎనలేవీ ఎనలేని సేవ చేసిన గొప్ప మానవతావాది, ఆదర్శనీయుడు, పారిశ్రామిక వేత్త, నిరాడంబరుడు రతన్ టాటా ఆకస్మిక మరణం పట్ల
తెలంగాణ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు, న్యాయవాది , సైకాలజిస్ట్, సంఘ సేవకులు దయాల ఓంప్రసాద్ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. క్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని ఎంతో ఆదుకున్న సేవాతత్పరుడని, స్వార్థం లేకుండా వస్తువుల నాణ్యతలో రాజీపడకుండా వ్యాపారం చేసిన గొప్ప మహనీయుడు టాటా అని అన్నారు. రతన్ టాటాను ఆదర్శంగా తీసుకుని ఎంతోమంది పారిశ్రామికవేత్తలు ఎదిగారనన్నారు. వేల కోట్ల రూపాయలు ఉన్నా నిరాడంబరునిగా జీవించడానికే ఇష్టపడేవారని, ఆయన ఎన్నో పరిశ్రమలు నెలకొల్పి, కోట్ల మందికి ఉపాధి కల్పించిన గొప్ప వ్యక్తి అని ఆయన సేవలు కొనియాడారు. అంతటి మహొన్నత వ్యక్తి మరణం దేశానికి తీరని లోటన్నారు.


