Wednesday, October 21, 2026
spot_img
HomeTELANGANAమోడల్ స్కూళ్ల ఉపాధ్యాయులకు 010 హెడ్ ఆఫ్ అకౌంట్ ద్వారా వేతనాలు చెల్లించాలి: MLC మల్క...

మోడల్ స్కూళ్ల ఉపాధ్యాయులకు 010 హెడ్ ఆఫ్ అకౌంట్ ద్వారా వేతనాలు చెల్లించాలి: MLC మల్క కొమరయ్య

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న రెగ్యులర్ ఉపాధ్యాయులను పాఠశాల విద్యాశాఖ (డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్) పరిధిలోకి తీసుకువచ్చి వారి వేతనాలను 010 హెడ్ ఆఫ్ అకౌంట్ ద్వారా విడుదల చేయాలని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య కోరారు. శుక్రవారం రెండో రోజు ప్రారంభమైన తెలంగాణ శాసనమండలి సమావేశాల్లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 194 మోడల్ పాఠశాలలు కొనసాగుతున్నాయని, వాటిలో పనిచేస్తున్న సుమారు 3,000 మంది ప్రిన్సిపాళ్లు, పీజీటీలు, టీజీటీలు నెలనెలా వేతనాల కోసం వారం నుంచి పది రోజుల వరకు ఎదురుచూడాల్సి వస్తోందని వేతనాల చెల్లింపుల్లో జరుగుతున్న ఈ ఆలస్యం కారణంగా మోడల్ స్కూళ్ల ఉపాధ్యాయులు ఆర్థిక, కుటుంబ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారని మోడల్ స్కూళ్లలో పని చేస్తున్న ఉపాధ్యాయులను కూడా ఇతర రెగ్యులర్ ప్రభుత్వ ఉపాధ్యాయుల మాదిరిగానే ట్రెజరీ పరిధిలోకి తీసుకువచ్చి, 010 హెడ్ ఆఫ్ అకౌంట్ ద్వారా వేతనాలు చెల్లిస్తే సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఈ అంశానికి సంబంధించి వినతి పత్రాన్ని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ద్వారా ప్రభుత్వానికి సమర్పిస్తున్నట్లు ఎమ్మెల్సీ మల్క కొమరయ్య తెలిపారు. మోడల్ స్కూళ్ల ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిగణించి త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments