ఒలింపిక్ క్రీడల నిర్వహణ పట్ల భారత్ ఆసక్తి చూపుతోంది. ఈ మేరకు 2036లో జరిగే ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చేందుకుగాను బిడ్ వేయడానికి భారత్ సిద్ధంగా ఉందని, 2023 సెప్టెంబరులో ముంబైలో జరిగే సమావేశంలో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)కి రోడ్ మ్యాప్‌ను అందించనున్నట్టు కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. ఈ క్రీడల అతిథ్యానికి బిడ్ వేసేందుకు భారత ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ)కు ప్రభుత్వం మద్దతుగా ఉంటుందని ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఆతిథ్యనగరంగా ఉండే అవకాశం ఉందని ఆయన అన్నారు.