రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు మండలాల్లో అర్హత లేని వ్యక్తులు నడుపుతున్న మెడికల్ షాపులపై డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రశ్నిస్తున్న ప్రజలు. అసలు మెడికల్ షాపులు ఎవరు నడపాలి. వారి అర్హతలు ఏమిటి? ఆర్ఎంపి లు మెడికల్ షాపులు నడపవచ్చా. పదవ తరగతి కూడా చదవని వారు మెడికల్ షాపులు పెట్టి నడిపిస్తున్నారు. బి ఫార్మసీ, డి ఫార్మసీ సర్టిఫికెట్ ఉన్నవారు మాత్రమే మెడికల్ షాపులు నడుపుటకు అర్హులు. కానీ సర్టిఫికెట్లు లేని వారు సైతం ఆర్ఎంపి, పిఎంపీలు మెడికల్ షాపులు పెట్టి నడుపుతున్న డ్రగ్ ఇన్స్పెక్టర్ కు ఎందుకు కనబడటం లేదని ప్రశ్నిస్తున్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలో, గంభీరావుపేట మండలంలో, ముస్తాబాద్ మండలంలో, అనేకమంది ఆర్ఎంపీలు మెడికల్ షాపులు నడిపిస్తున్నారు. ఎందుకు వీరిపై చర్యలు తీసుకోవడం లేదు. సర్టిఫికెట్ ఒకరిది మెడికల్ షాప్ నడిపించేది ఒకరు. ఆర్ఎంపీ లు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలి. వారి సేవలు అవసరం, కానీ డాక్టర్ అని బోర్డులు పెట్టుకొని యాంటీబయోటిక్, సెలైన్స్, ఇంజక్షన్స్ ఇస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. గతంలో ఆర్ఎంపీ వైద్యులు ఇంజెక్షన్ ఇవ్వడం వలన ఎల్లారెడ్డిపేటలో ఒకరి ప్రాణం పోయిన. విషయం విధితమే. ఇంత తతంగం జరుగుతున్న డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎందుకు చొరవ చూపటం లేదని ప్రశ్నలు వెలువెత్తుతున్నాయి. ఆర్.ఎం.పి, పి.ఎం.పి లు ప్రధమ చికిత్స కు బదులు ఎంబీబీఎస్, ఎండీలు చేసే వైద్యం చేస్తున్నారు. దీని వెనకాల ఉన్నది ఎవరు? జిల్లా వైద్యాధికారుల లేదా డ్రగ్ ఇన్స్పెక్టర్ అండదండల. డ్రగ్ ఇన్స్పెక్టర్కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేయకుండా అర్హత లేకుండా మెడికల్ షాపులు నడుపుతున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పలు మేధావులు తెలియజేస్తున్నారు. చర్యలు తీసుకోన్నట్లయితే జిల్లా కలెక్టర్ తో పాటుగా, ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేస్తామని పలువురు సూచనప్రాయంగా తెలియజేశారు..