పది మంది కొడుకులు ఉన్న ఒక్క కూతురుతో సరితూగరని నిరూపించింది ఎల్లారెడ్డి పేట కు చెందిన నేవూరి సౌజన్య. తనను అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన తన తండ్రి అకాల మరణం చెందగా తన తండ్రి నేవూరి సురేందర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఎల్లారెడ్డి పేట డే కేర్ సెంటర్ లో ఘనంగా జరిపారు. ఎల్లారెడ్డి పేటకు చెందిన నేవూరి సురేందర్ రెడ్డి ఎల్లారెడ్డి పేటలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో కాంటింజెంట్ వర్కర్ గా పనిచేస్తూ ఇటీవల అకాల మరణం చెందారు. సురేందర్ రెడ్డి కి ఒక్కగానొక్క కూతురు సౌజన్య తన తండ్రి సురేందర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా డే కేర్ సెంటర్ లో ఉన్న వృద్దులకు చికెన్ తో బోజనాలు వడ్డించి పండ్లు, బిస్కెట్లు అందించి తండ్రి పై అభిమానం చాటుకుంది. నేవూరి సౌజన్య వెంట ఎల్లారెడ్డి పేట మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్, యూత్ కాంగ్రెస్ నాయకులు బుచ్చి లింగు సంతోష్ గౌడ్ తో పాటు డే కేర్ సెంటర్ నిర్వాహకులు పాల్గొన్నారు.