రాజన్న సిరిసిల్ల జిల్లా మండలం ఇల్లంతకుంట ఓబులాపురం గ్రామంకు చెందిన మెడకోకుల నరసయ్య(81) నిన్న తప్పిపోయి అల్లాజిపేట బస్టాండులో మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజుకు కనిపించడంతో వెంటనే వృద్ధుల ఆశ్రమ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఈ సమాచారాన్ని జిల్లా సంక్షేమ శాఖాధికారిణి లక్ష్మీ రాజ్యాంకు తెలియజేయడంతో వృద్ధుని తీసుకెళ్లి ఎల్లారెడ్డిపేటలోని డే కేర్ సెంటర్ మరియు వృద్ధుల ఆశ్రమంలో ఆశ్రమం కల్పించారు. ఈ సమాచారాన్ని ఓబులాపురం సర్పంచ్ కు ఫోన్ ద్వారా సమాచారం అందించి అతని కుమారుడికి తన తండ్రిని అప్పగించారు. ఒకరోజు రాత్రిపూట డీకే సెంటర్లో షెల్టర్ ఏర్పాటుచేసిన మాజీ ఎంపిటిసి ఒగ్గు బాల్రాజ్ యాదవ్ కు మరియు బిజెపి నాయకుడు పరిపెల్లి సంజీవరెడ్డి కు డీ కేర్ సెంటర్ అధికారి మమతకువృద్ధుని కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు