ఎవరూ చేయనంత భారీగా, ఇంకెవరూ అందుకోనంతగా వేగంగా ‘రుణాల రేసు’లో జగన్ సర్కారు దూసుకుపోతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి, అంటే ఎన్నికల సమయానికి రాష్ట్ర అప్పులు రూ.10 లక్షల కోట్లకు చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర అప్పులు 9.03లక్షల కోట్ల మైలు రాయిని దాటాయి. ఇవి స్వయంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ప్రభుత్వం, ఇతర సంస్థలు సమర్పించిన గణాంకాలే. దీని ప్రకారం ఏపీ అప్పుల చిట్టా ఇలా ఉంది…
‘పౌరసరఫరాలు’ టాప్..:
అధికారిక లెక్కల ప్రకారం 35 ప్రభుత్వ రంగ సంస్థల పేరిట ప్రభుత్వం ఇప్పటి వరకు 2,49,136.58 కోట్ల రూపాయల అప్పులు తెచ్చింది. ఇందులో కేంద్రం అనుమతి లేకుండా రాష్ట్ర స్థాయిలోనే తీసుకున్న అప్పులు కూడా ఉన్నాయి. అప్పుల్లో పౌరసరఫరాల కార్పొరేషన్ 37వేల కోట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 15,741 కోట్లు, ఏపీ డిస్కమ్‌లు 11,120 కోట్లు అప్పులు తెచ్చాయి. ప్రభుత్వ గ్యారంటీ లేకుండా, కార్పొరేషన్‌లు సొంత ఆస్తులను తనఖాపెట్టి ఏకంగా 87,233 కోట్ల అప్పులు తెచ్చాయి.
అప్పుల చిట్టా….
1) 2022-23 కాగ్ నివేదిక ప్రకారం రాష్ట్రానికి ఉన్న అప్పు: 4,13,000 కోట్లు
2)ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్‌ల అప్పులు: :1,38,603.58 కోట్లు
3) ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ అప్పు :10,000 కోట్లు
4) ప్రభుత్వ రంగ సంస్థలు సొంత ఆస్తులు తాకట్టు పెట్టి తెచ్చిన అప్పులు: 87,233 కోట్లు
5) ప్రభుత్వం ఇప్పటి దాకా చెల్లించాల్సిన బిల్లులు:1,50,000 కోట్లు
2022-23 ఆర్థిక సంవత్సరంలో…
6) ఈనెల 28 వరకు రిజర్వు బ్యాంకు నుంచి తెచ్చిన అప్పు : 45,300 కోట్లు
7) 2022-23 కేంద్ర ప్రభుత్వ రుణాలు: 4,000 కోట్లు
8) బేవరెజెస్ కార్పొరేషన్ ద్వారా తీసుకొచ్చిన ఎన్‌డీసీఎ్‌స అప్పు: 8300 కోట్లు
9) బ్యాంకుల నుంచి ప్రభుత్వ రంగ సంస్థలు తెచ్చిన అప్పులు : 12,000 కోట్లు
10) 2022-23లో బకాయి ఉన్న బిల్లులు: 35,000 కోట్లు
మొత్తం అప్పులు: 9,03,436.58 కోట్లు