బహుజన్ సమాజ్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు వర్ధవెల్లి స్వామి గౌడ్ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంకని భాను, రాష్ట్ర కార్యదర్శి ఎనగందుల వెంకన్న హాజరై మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నదని దాన్ని రక్షించుకోవాల్సిన అత్యవసర పరిస్ధితులు దేశంలో నెలకొన్నయని, భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని, దీన్ని అడ్డుకోవాల్సిన చారిత్రక అవసరం ఉందని తెలియజేశారు. రాజ్యాంగాన్ని రక్షించుకోవడం ద్వారానే బీసీ,ఎస్సీ,ఎస్టీ,మత మైనార్టీల హక్కులు కలిగి, న్యాయం జరుగుతుందని, ప్రజాస్వామ్యాన్ని రక్షించు కోవడంతోపాటు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంతో మెలగాల్సిన అవసరం ఉందని వారు అన్నారు. భారత రాజ్యాంగాన్ని కాపాడే ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ అని, భారత రాజ్యాంగాన్ని కాపాడడం కోసం రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఎస్పీ బలపరిచిన అభ్యర్థులకు బహుజనులందరూ తమ ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ చాకలి రమేష్, వేములవాడ నియోజకవర్గ అధ్యక్షులు గసికంటి అరున్, సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు అరుకల రమేష్, ఉపాధ్యక్షుడు గుంటుక రమేష్, చెట్టిపల్లి నరేందర్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బందెల దేవరాజ్, నియోజకవర్గ కార్యదర్శి తడుక బాను, పార్టీ తంగళ్ళపల్లి మండల ఉపాధ్యక్షుడు మునిగే భాస్కర్, ముస్తాబాద్ మండల ఇంచార్జీ జోగేల్లి శ్రీనివాస్, మండల అధ్యక్షుడు బత్తుల దేవరాజ్, మెరుగు శ్రీనివాస్, పార్టి సీనియర్ నాయకుడు వెంగళ ఆంజనేయులు, సిద్దు నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.