ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ గ్రామంలో చత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట సత్సంగ సదనం అధ్యక్షులు బ్రహ్మచారి లక్ష్మారెడ్డి, అయ్యప్ప స్వామి గురుస్వామి శ్రీ నివాస్ గౌడ్ లు కలిసి జండా ఆవిష్కరించారు, అల్మాస్పూర్ గ్రామంలో చత్రపతి శివాజీ 393వ జయంతి సందర్భంగా శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి, కొబ్బరికాయలు కొట్టి స్వీట్ పంపిణీ చేసి గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గురు స్వామి మాట్లాడుతూ, చత్రపతి శివాజీ జయంతి ఉత్సవాన్ని, సాంప్రదాయంలో, భారతదేశంలో ఎన్నో పోరాటాలు చేసి, వీరునిగా ప్రపంచ శాంతి కోసం ఎంతో కృషి చేశారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో, సురేందర్ రెడ్డి, అంజల్ రెడ్డి, చల్ల మధు, సింగరేణి శ్రీనివాస్, వంగ అంజ గౌడ్, సురేష్, ఉచ్చిడి మోహన్ రెడ్డి, శరత్ రెడ్డి, సాయి, కార్తీక్ రవి తదితరులు పాల్గొన్నారు