Warning: Uninitialized string offset 0 in /home/therainbowservic/inquilabtv.com/wp-includes/class-wp-dependencies.php on line 1

Warning: Uninitialized string offset 0 in /home/therainbowservic/inquilabtv.com/wp-includes/class-wp-dependencies.php on line 1
పటిష్టమైన ప్రణాళికతో రానున్న పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ. - inquilabtv.com
Saturday, December 7, 2024
spot_img
HomeTELANGANAపటిష్టమైన ప్రణాళికతో రానున్న పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ.

పటిష్టమైన ప్రణాళికతో రానున్న పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ.

ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేల పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాట్లు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాకు చేరుకున్న కేంద్ర సాయుధ పోలీసు బలగాలతో జిల్లా ఎస్పీ సమావేశం. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు జిల్లా పోలీసు సిబ్బందికి సహాయంగా వచ్చిన CISF కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలతో ఎన్నికల సమయoలో నిర్వహించాల్సిన విధులపై సిరిసిల్ల పట్టణ పరిధిలోని అంబేద్కర్ భవనంలో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ .

ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన అన్ని విధుల్లో కేంద్ర బలగాలు జిల్లా పోలీసులతో కలిసి ఎన్నికల ముందు, పోలింగ్ రోజు, ఎన్నికల తరువాత ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నియంత్రించడమే లక్ష్యంగా పనిచేస్తామని కేంద్రం సాయుధ బలగాలును క్రిటికల్ పోలింగ్ స్టేషన్ లలో, రూట్ బందోబస్త్, కీలకమైన పాయింట్‌ల వద్ద సెంట్రల్ ఫోర్స్ సిబ్బందిని ఉంచుతామన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ల దగ్గర పటిష్ట నిగా ఏర్పాటు చేసి ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించాలని లోకల్ పోలీస్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎలాంటి గొడవ లేకుండా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి ప్రతి అధికారి కృషి చేసి ఎన్నికల విజయవంతం చేయాలని, సమస్యాత్మక గ్రామాలపై, ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి ఫ్లాగ్ మార్చ్, రూట్ మార్చ్ నిర్వహిస్తూ ప్రజలకు భద్రత భావాన్ని కలిగించాలని అన్నారు. ఎన్నికల పరంగా మరియు సదుపాయాల పరంగా ఎలాంటి సమస్యలు ఉన్న అధికారులకు తెలియజేయాలని సూచించారు. అనంతరం ఎస్పి జిల్లాలో ఉన్న పోలింగ్ స్టేషన్ వివరాలు, చెక్ పోస్ట్ లు, జిల్లా యొక్క భౌగోళిక పరిస్థితుల గురించి CISF అధికారులకు ఎస్పీ వివరించారు. ఎస్పీ వెంట డిఎస్పీ నాగేంద్రాచారి, సి.ఐ సధన్ కుమార్, స్పెషల్ బ్రాంచ్ సి.ఐ అనిల్ కుమార్, CISF అధికారులు, సిబ్బంది ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments