రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు వద్ద హైదరాబాదు నుండి వచ్చిన “గోల్డ్ లాకర్” బొలెరో వాహనం నుంచి బ్యాంకు లోనికి తరలిస్తున్న తరుణంలో బొలెరో వాహనం (TS 09 U D1186)ఒక్కసారిగా ముందువైపు జరగడంతో లాకర్ ముందువైపు ఉన్న యూపీ కి చెందిన వ్యక్తి పరమేష్ (45)పై పడి కుడికాలు నుజ్జు నుజ్జు అయింది. లాకర్ కింద పడి ఉన్న వ్యక్తిని బయటకు తీసేందుకు సుమారు 20 మంది ప్రయత్నించగా రెండు టన్నులు బరువు ఉండడంతో లాకర్ వ్యక్తి పైనుండి బయటకు తీయడానికి వీలు కాలేదు, వెంటనే JCB సహకారంతో లాకర్ను వ్యక్తి పైనుంచి తొలగించారు. గాయాల పాలైన వ్యక్తిని వెంటనే అంబులెన్స్ లో సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరమేష్ కు భార్య ముగ్గురు సంతానం ఉన్నారు.
బ్యాంకులో “గోల్డ్ లాకర్” అవసరం ఉండడంతో మేము గోల్డ్ లాకర్ ను ఆర్డర్ చేశాము, లాకర్ కు సంబంధించిన కంపెనీ వాళ్ళు లాకర్ను వారి కూలీల సహకారంతో తీసుకొచ్చి బ్యాంకులో బిగిస్తారు, అదే క్రమంలో హైదరాబాదు నుండి నేడు ఉదయం లాకర్ను తీసుకొచ్చి బ్యాంకు లోనికి తరలిస్తున్న సమయంలో బొలెరో వాహనం ఒక్కసారిగా ముందుకు జరగడంతో లాకర్ ముందు ఉన్న కూలిపై పడి కాలుకు తీవ్ర గాయాలు అయ్యాయి, తగిన జాగ్రత్తలు తీసుకోకుండా, లాకర్ను తరలించడంతో ఈ ప్రమాదం జరిగిందని బ్యాంకు మేనేజర్ తెలిపినారు