ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో స్పెషల్ డెవలప్మెంట్ కింద పది లక్షల వ్యయంతో పెద్దమ్మల కాలనీలో 5 లక్షల సిసి రోడ్ మరియు యువకులకు ఆరోగ్యంగా ఉండడానికి 3 లక్షల వ్యయంతో ఓపెన్ జిమ్ము మరియు రెండు ఐమాక్స్ లైట్లు నిర్మాణానికి మండల పార్టీ అధ్యక్షుడు ఏళ్ల బాల్ రెడ్డి ఆధ్వర్యంలో భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జడ్పిటిసి గుండం నరసయ్య,, జిల్లా కార్యదర్శి పెద్ది గారి శ్రీనివాస్, ముస్తాబాద్ ఎంపీటీసీ చర్లపల్లి శ్రీనివాస్ గౌడ్, ముస్తాబాద్ పట్టణ శాఖ అధ్యక్షులు గజ్జలరాజు హాజరై పనులను ప్రారంభించారు.సిసి రోడ్ మరియు ఓపెన్ జిమ్ మరియు ఐమాక్స్ లైట్స్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కే. కే మహేందర్ రెడ్డి తో పాటు మండలాధ్యక్షుడు బాల్ రెడ్డి లకు పోతుగల్ గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసి చైర్మన్ అంజన్ రావ్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు తలారి నర్సింలు, గ్రామశాఖ అధ్యక్షులు అనమేని రాజు, గ్రామ యువత అధ్యక్షులు కేసుగాని చంద్రమౌళి, మామిండ్ల ఆంజనేయులు, కిరణ్, కేసు గాని రాజయ్య,చంద్రం రాములు, పెద్దమ్మల పోచయ్య తదితరులు పాల్గొన్నారు.