రాజన్న సిరిసిల్ల జిల్లా, ఇల్లంతకుంట మండల కేంద్రంలో నంబర్ ప్లేట్స్ లేని టూ వీలర్ వాహనాలను శుక్రవారం నాడు పోలీసులు పట్టుకొని పోలీస్ స్టేషన్లో పెట్టారు. వాహనాలకు నెంబర్ ప్లేట్స్ తప్పనిసరిగా ఉండాలని ఎస్సై పేర్కొన్నారు. నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలను ట్రాక్టర్లను అదుపులోకి తీసుకుంటామని ఎస్సై ఎల్ రాజు గౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం నాడు నంబర్ ప్లేట్స్ లేని ఆరు వాహనాలను పట్టుకొని పోలీస్ స్టేషన్లో పెట్టినట్టు ఎస్సై రాజు గౌడ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అదేవిధంగా పోలీస్ స్టేషన్లో రెండు ఆటోలు అబాన్ డెడ్ గా ఉన్నవని అవి ఎవరి వాహనాలో తీసుకువెళ్లాలని ఇల్లంతకుంట ఎస్సై ఒక ప్రకటనలో పేర్కొన్నారు.