తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ TWJF నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా జమ్మికుంట పట్టణానికి చెందిన ఏబూసి. సంపత్ ను కమిటీ సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా నాయకులు అరికిల్ల భానుచందర్, దొడ్డ రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు మాట్లాడుతూ ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా ఉన్న అయిత రాధాకృష్ణను తొలగిస్తున్నట్లు వారు ప్రకటించారు. నియోజకవర్గంలో వర్కింగ్ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పైన నిరంతరం పోరాటం చేస్తూ సమస్యల పరిష్కార దిశగా ప్రతి ఒక్క జర్నలిస్టు పనిచేయాలని అన్నారు. అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో నియోజకవర్గ అధ్యక్షులు సౌడమల్ల యోహాన్, సహాయ కార్యదర్శి ఎండి ఖాజా ఖాన్, భూపతి సంతోష్, కోశాధికారి దయ్యాల సుధాకర్, యూనియన్ సభ్యులు ఎండి రఫీక్ తదితరులు పాల్గొన్నారు..