రాజన్న సిరిసిల్లజిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ కార్యకర్త సయ్యద్ గౌస్ (61) గత నాలుగు రోజుల క్రితం అనారోగ్యానికి గురై మంగళవారం తన నివాసంలో తుది శ్వాస విడిచాడు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు ప్రగాఢ సానుభూతిని తెలిపారు మృతునికి భార్య , పిల్లలున్నారు. గౌస్ బాయ్ మరణం పార్టీకి తీరని లోటని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య, సద్ది లక్ష్మారెడ్డి, వంగ గిరిధర్రెడ్డి, మర్రి శ్రీనివాస్ రెడ్డి, బండారి బాల్ రెడ్డి, ఒగ్గు బాల్ రాజు లు అన్నారు. ప్రగాడ సానుభూతి తెలిపారు. సయ్యద్ గౌస్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు.