ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ జాతీయ యువ పురస్కార అవార్డు గ్రహీత అందే భాస్కర్ కు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో కులేరి కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో పలువురు కళాకారులు యువ నాయకుల ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సత్కరించారు. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ జాతీయ యువ పురస్కార అవార్డు గ్రహీత అందే భాస్కర్ డప్పు పై 150 కి పైగా శబ్దాలను వాయిస్తూ జాతీయ అవార్డుకు ఎంపికయ్యాడు. దేశంలోనే మొట్టమొదటిసారిగా బిస్మిల్లా అవార్డు డప్పు కళాకారుడికి అందడం అభినందనీయం. అందే భాస్కర్ – జమున దంపతులు ఎల్లారెడ్డిపేటకి రావడంతో మండల ప్రజలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు ముత్తయ్య, దరువు రమేష్, కొర్రి అనిల్, ప్రమోద్, కోరుట్లపేట మధు, బంటి, ఆశీర్వాదం, పరుశురాం పలువురు కళాకారులు పాల్గొన్నారు,