భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ జిల్లాఅధ్యక్ష కార్యదర్శులు గేడం టీకానంద్ గోడిసెల కార్తీక్ మీడియాతో మాట్లాడుతూ DYFI ఆధ్వర్యంలో భగత్ సింగ్ 93వ వర్ధంతి సందర్భంగా వాంకిడి మండలంలో భగత్ సింగ్ గ్రౌండ్ కూరగాయల మార్కెట్ వద్ద మార్చి 7, 8 తేదీలలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించనున్నామని ఈ కబడ్డీ పోటీలకు మొదటి బహుమతి రూ. 7000 షీల్డ్, రెండవ బహుమతి రూ. 5000 షీల్డ్, ఇవ్వనున్నామని క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొనేందుకు ఎంట్రీ ఫీజు 500 రూపాయలు చెల్లించాలని ఈనెల ఆరవ తేదీలోపు కబడ్డీ క్రీడాకారులు మీయొక్క టీంలను నమోదు చేసుకోవాలని కోరుతున్నామన్నారు. మార్చ్ 8, 10 తేదీలలో జడ్పీహెచ్ఎస్ గ్రౌండ్లో జరగాల్సిన కబడ్డీ పోటీలను మార్చి 7 8 తేదీలలో కూరగాయల మార్కెట్ వద్ద మార్చామని కావున క్రీడాకారులు మీ యొక్క ఎంట్రీ ఫీజు ని ఆరో తారీకు సాయంత్రం వరకు నమోదు చేసుకోవాలని నమోదు చేసుకోవడానికి సెల్ నెంబర్స్ 6302363282, 8919069178, 7702664187, 9866467112 సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లాఅధ్యక్ష కార్యదర్శులు గేడం టీకానంద్, గోడిసెల కార్తీక్, జిల్లా ఉపాధ్యక్షులు చాపిడి పురుషోత్తం, దుర్గం నిఖిల్, సహయ కార్యదర్శులు దుర్గం రాజ్ కుమార్, వడ్లూరి శ్రీకాంత్ పాల్గొన్నారు