అంతర్జాతీయ మత్తు పదార్దాల వ్యతిరేక దినంలో బాగంగా విజయనగరం వీటీ అగ్రహారం బీసీ కాలనీలో రూరల్ పోలీసులు స్టూడెంట్స్ ర్యాలీ నిర్వహించారు. బీసీ కాలనీలోని మహిళా ప్రాంగణం నుంచీ ప్రారంభమైన ఈ ర్యాలీ వీటీ అగ్రహారం వరకు కొనసాగింది. ఈ ర్యాలీ రూరల్ సీఐ లక్ష్మణరావు ఆధ్వర్యంలో జరుగగా స్టేషన్ సిబ్బంది, ఎస్ఐ అశోక్, మీనాక్షి, రామారావులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఐ లక్ష్మణరావు మాట్లాడుతూ ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాలతో బీసీ కాలనీలో స్టూడెంట్స్ చే మత్తు పదార్దాల వినియోగం వద్దంటూ ర్యాలీ నిర్వహించామన్నారు. రూరల్ పరిదిలో ఏడాది కాలంలో 38 కేసులు నమోదు చేసి 1300 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని ఈ ఏడాది ఇప్పటివరకు 118 కేసులలో 2100 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, 388 మందిని అరెస్ట్ చేసామని 23 మందిపై షీట్స్ తెరిచామని సీఐ లక్ష్మణరావు తెలిపారు. గంజాయి నిర్మూలనపై తమ శాఖ చాలా సీరియస్ గా ఉందని పోలీస్ బాస్ ఆదేశాలతో ఏ ఒక్కరిని విడిచి పెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేసారు.
మత్తు పదార్దాలకు వ్యతిరేకంగా స్టూడెంట్స్ తో ర్యాలీ…!
RELATED ARTICLES


