నిన్న కేటీఆర్ కరీంనగర్ వచ్చినప్పుడు సోషల్ మీడియా వారియర్స్ మీటింగ్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం పద్ధతి కాదు నోరు అదుపులో పెట్టుకోవాలని జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ పక్షాన హెచ్చరిస్తున్నామని పదేళ్లలో తెలంగాణకు ఏం చేశారో చెప్పి ఉన్న శాసనసభ్యులను కాపాడుకోండని సలహా ఇచ్చారు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహమ్మద్ తాజుద్దీన్. మీకు బిజెపితో ఉండే లోపాయికార ఒప్పందము దేశం మొత్తం తెలుసని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి, అదే స్కామ్లో మీ చెల్లె కవిత కూడా ఉన్నదని ఢిల్లీ ఉపముఖ్యమంత్రిని జైలుకు పంపి ఆమెను జైలుకు ఎందుకు పంపలేదని ప్రశ్నించారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్కు బిజెపికి మధ్య లో లోపాయి కారి ఒప్పందం ఉన్నదని మీరు అనడం చాలా సిగ్గుచేటన్నారు.
ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఒక గుడి గాని బడి గాని కట్టలేదని టిఆర్ఎస్ ఎంపీ అయినా వినోద్ కుమార్ లు కలిసి పొన్నం ప్రభాకర్ ఎంపీగా ఉన్న ఐదు సంవత్సరాలలో తెచ్చిన నిధుల్లో బండి సంజయ్ గాని వినోద్ కుమార్ గాని 10% కూడా తీసుకో రాలేదని, మేము మైనార్టీ సెల్ పక్షాన రైట్ టూ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కు వెళ్తే టిఆర్ఎస్ ఎంపీ ఉన్నప్పుడు వినోద్ కుమార్ 10% నిధులు కూడా కరీంనగర్ జిల్లా కు తీసుకురాలేదన్నారు. కాంగ్రెస్ 420 అని మీరు అంటున్నారు, కానీ మీరు గత పది సంవత్సరాల నుండి మైనార్టీలకు, దళితులకు ప్రతి ఒక్కరిని చీటింగ్ చేసుకుంటూ 10 సంవత్సరాలు గడిపారు, మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్ అన్నారు ఎంతమంది ముస్లింలకు ఇచ్చారు, దళితులకు కూడా మూడు ఎకరాలు భూమన్నారు, దళిత బంధు ఎక్కడికి పోయిందన్నారు. మా ప్రభుత్వం వచ్చి 45 రోజులు కూడా కాలేదు ఆరు గ్యారంటీ స్కీములలో రెండు గ్యారంటీలు అమలు అవుతున్నాయి. నాలుగు గ్యారంటీ స్కీముల కోసం వంద రోజులు టైం ఇచ్చినా కూడా 420 అని ప్రభువు అందరి చీటింగ్ చేస్తూబిజెపికు మీకు తేడా లేదు లేని ఉన్నట్టు ఉన్నది లేనట్టు సోషల్ మీడియాలో సృష్టించు జోకులల్లుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి 45 రోజులు కూడా గడవకముందే 420 అన్నాడు చాలా సిగ్గుచేటు బాధాకరం మీరు పెద్ద 420 గాళ్లు ఉన్న బడ్జెట్లో మొత్తం తీసుకుపోయి కాలేశ్వరంలో పెట్టి కమిషన్ల కక్కుర్తి కాలేశ్వరం మొత్తం కృంగిపోయే విధంగా ఒక తెలంగాణలో ఎవరికి నీరు రాకుండా చేసి ఉన్న డబ్బులని మొత్తం స్వాహా చేశారు. ఈ కాలేశ్వరం, మేడిగడ్డ విషయంలో మీరు జైలుకి వెళ్లడం ఖాయం.
ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ టిఆర్ఎస్ కార్పొరేటర్లు గాని లీడర్లు గాని ప్రతి ఒక్కరు ల్యాండ్ మాఫియా, చీటింగ్ చేస్తూ భూములను రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళ మీద కేసులు అవుతున్నాయి. మీరు 420 గాళ్లు మీరు పెద్ద బ్రోకర్ గా ఉండి వేరే వాళ్ళని 420 అనడం హాస్యాస్పదం. 10 సంవత్సరాలు అందరిని మభ్యపెడుతూ ఏ స్కీం కూడా అమలు కాకుండా చేసి మమ్ములను దొంగలు అనడం చాలా దారుణం, త్వరలో కేసీఆర్ సీఎం అవుతారని అంటున్నారు మీరు ఉన్న 36 మంది ఎమ్మెల్యేలను కాపాడుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం 6 గ్యారెంటీలే కాకుండా ఇంకా ఎన్నో గ్యారంటీ స్కీములు అమలు చేస్తాము, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు బి ఆర్ ఎస్, బిజెపి వాళ్ళ లాగా చెయ్యం, ప్రజలు మొత్తం చూస్తున్నారు, ప్రజలు మిమ్ములను నమ్మే పరిస్థితి లేదు మీరు గడిచిన పది సంవత్సరాలు చేయని అభివృద్ధిని మేము ఒక సంవత్సరంలో చేసి చూపిస్తామని కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నాము. ఇక ముందు మీరు ఇలా జోకులు వేయడం కానీ ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పి కాంగ్రెస్ ఆగ్రహానికి గురి కావద్దు, మేము తలుచుకుంటే మీ ఎమ్మెల్యేలను కొనొచ్చు కాని మేము అలా చెయ్యం, ఎందుకంటే ప్రతిపక్షం అనేది ఉండాలి. ఇకనైనా కేటీఆర్ కానీ బిఆర్ఎస్ నాయకులు గాని నోరు అదుపు పెట్టుకోవాలి, మీరు గడిచిన పది సంవత్సరాలు ఒక్కటి కూడా అమలు చేయకుండా మమ్ములను ఏమి చేయలేదని అనడం సరికాదు. ఇకనైనా ఇలా మాట్లాడొద్దని మైనార్టీ సెల్ పక్షాన హెచ్చరిస్తున్నాము. అన్నారు మహమ్మద్ తాజుద్దీన్. ఈ విలేకరులసమావేశంలో నగర మైనార్టీ సెల్ అధ్యక్షులు సయ్యద్ అఖిల్, నగర మైనార్టీ ఉపాధ్యక్షులు లైఫ్ హాజరి, ప్రధాన కార్యదర్శి నిహాల్ అహ్మద్, అబ్దుల్ రెహమాన్, ఫెరోస్ ఖాన్, అబ్దుల్ కరీం, ఫిరోజ్, రాజి, ఇర్షాద్, నదీమ్ తదితరులు పాల్గొన్నారు.