కొత్త ఏడాది సంబరాలు స్టార్ హోటల్స్‌కు సిరులు కురిపిస్తున్నాయి. డిసెంబరు 31 రష్‌తో దేశవ్యాప్తంగా ఉన్న స్టార్ హోటల్స్ అన్నీ కిటకిటలాడుతున్నాయి. కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలికేందుకు ఎంతైనా ఖర్చు పెట్టేందుకు సై అంటున్నారు. దేశంలోని అన్నీ ప్రధాన నగరాల్లోని స్టార్ హోటల్స్‌లోని గదులన్నీ దాదాపు బుక్ అయినట్లు సమాచారం. కొత్త సంవత్సర వేడుకులను వినూత్నంగా నిర్వహించే ఉదయ్‌పూర్, జైపూర్, గోవాలోని స్టార్ హోటల్స్ రూములన్నీ ఎప్పుడో బుక్ అయిపోయాయి. ఒకవేళ కొన్ని రూమ్స్ ఖాళీగా ఉన్నా వాటి చార్జీలు చుక్కలంటుతున్నాయి. మామూలు రోజులతో పోల్చితే స్టార్ హోటల్స్ అన్నీ రూమ్ చార్జీలను సగటున 40ు వరకు పెంచేశాయి.
ఈ హోటల్‌లో సూట్ చాలా ఖరీదు గురూ..
రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారా హోటల్ అయుతే డిసెంబరు 31న తన మహరాజా సూట్‌లో బస చేసేవారి నుంచి అక్షరాలా రూ.7 లక్షలు చార్జీ చేస్తోంది. అదే రోజు ఇదే హోటల్‌లో సాధారణ లగ్జరీ రూమ్‌లో బస చేయాలన్నా రూ.1.2 లక్షలు చెల్లించాలి. ఉదయ్‌పూర్‌లోని ది లీలా ప్యాలెస్ ఉదయ్‌పూర్‌లో అయుతే న్యూ ఇయర్ వేడుకల కోసం రూమ్స్ అన్నీ ముందే బుక్ అయిపోయాయి. ఇదే హోటల్ క్రిస్మస్ వేడుకల కోసం రూమ్‌కి రూ.1,06,200 చొప్పున వసూలు చేసింది. ఉదయ్‌పూర్, జైపూర్‌ల్లోని స్టార్ హోటల్స్ డిసెంబరు 31 వేడుకల కోసం వచ్చే వారి నుంచి రూమ్‌కి సగటున రూ.31,683 నుంచి రూ.55,000 వరకు వసూలు చేస్తున్నాయి. గోవాలోని స్టార్ హోటల్స్‌లోనూ డిసెంబరు 31కి రూమ్ చార్జీలు సగటున రూ.18,000 నుంచి రూ.32,000 పలుకుతున్నాయి. జైపూర్‌లోని ఫెయిర్‌మాంట్ హోటల్ డిసెంబరు 31 వేడుకల కోసం రూ.65,000తో ప్రత్యేక ప్యాకేజీ అందిస్తోంది.