కొమురంభీం అసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రేమల గార్డెన్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి విచ్చేసిన పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్కని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు జాడి శ్రీనివాస్, కృష్ణపల్లి సురేష్, మున్నా ఖాన్ తదితరులు. ఈ సమావేశంలో సీతక్క మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలిచి రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా చేయడమే తమ ప్రధాన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో 100 రోజుల్లో రాష్ట్రంలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొక్కిరాల విశ్వ ప్రసాద్ రావు, శ్యామ్ నాయక్, ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, జిల్లా ప్రజానీకం పాల్గొన్నారు.