16వ తేదీ రాత్రి సమయంలో తాళం వేసిన ఇళ్లలో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసి ఊరుకు వెళ్లిన సమయాన్ని అదునుగా చూసుకొని దొంగలు చేతివాటం చూయిస్తున్నారు. చిప్పలపల్లి గ్రామంలో గాడిచర్ల నరసయ్య, గాడిచర్ల నరేష్ ఇంట్లో వాళ్ళు ఊరికి వెళ్లడం అదునుగా చూసుకొని దొంగలు వారి ఇంట్లో బీరువా పగలగొట్టి గాడిచర్ల నరసయ్య ఇంట్లో 1,85,000 రూపాయల నగదు, ఒక తులం వెండి, గాడి చర్ల నరేష్ ఇంట్లో బంగారు గుండ్లు, తులము చెవుల కమ్మలు చిన్న శివకములు, రెండు తులాలు వెండి పట్టగొలుసులు, రెండు జతలు గ్రేస్ లేటు, వెండి చిన్నపిల్లల పట్ట గొలుసులు, నడుము వెండి గొలుసు ఎత్తుకెళ్లారని బాధితులు గాడిచర్ల నరసయ్య మరియు నరేష్ లు అన్నారు. నరేష్ మరియు నరసయ్యల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని వివరాలు సేకరిస్తున్నామని ఎస్సై తెలిపారు. ముస్తాబాద్ మండలంలో పలు గ్రామాల్లో జరుగుతున్న ఈ దొంగతనాల వల్ల ప్రజలు భయఆందోళన చెందుతున్నారు