రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన దేశపాండి మల్లయ్య లక్ష్మి దంపతుల కూతురు దేవిక వివాహం సందర్భంగా తాజా మాజీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి పుస్తె మట్టలను అందజేశారు. శుక్రవారం మాజీ ఉపసర్పంచ్ ధ్యాగం నారాయణ, మండల రెడ్డి సంఘం మాజీ అధ్యక్షులు గన్న మల్లారెడ్డి దేశపండి మల్లయ్య నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.