హైదరాబాద్: మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్‌ఎస్ నేతలు బీజేపీలో చేరారు. పీఏసీఎస్ చైర్మన్ చక్రధర్‌రెడ్డి, సెస్ మాజీ డైరక్టర్ కొక్కు దేవేందర్‌యాదవ్, సర్పంచి సంధ్యారాణి తదితరులు కాషాయ కండువా కప్పుకొన్నారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ నాయకత్వం పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. ఆ పార్టీ నేతల అవినీతిని ఎండగట్టి తీరతామని స్పష్టం చేశారు.