రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో మహాత్మ జ్యోతిరావు పూలే 197వ జయంతి వేడుకలు బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు అందే శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గ అధ్యక్షులు తాటిపల్లి అంజయ్య, మండల ఇంచార్జ్ లింగాల సందీప్ హాజరైనారు. వారు మాట్లాడుతూ విద్య లేకుంటే వికాసం లేదు, వికాసం లేకుంటే పురోగతి లేదు, పురోగతి లేకుంటే ప్రగతి లేదు, ప్రగతి లేకనే శూద్రులు అతిశూద్రులుగా అధోగతి పాలయ్యారని వీటన్నిటికీ మూలం విద్య అని రెండు శతాబ్దాల కిందటనే చెప్పిన గొప్ప సామాజిక ఉద్యమ కారుడు, గొప్ప సంఘసంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే అన్నారు. దేశము అభివృద్ధి చెందాలంటే విద్య మాత్రమే మూలం అని, స్త్రీలు విద్య ద్వారానే తమ హక్కులను సాధించగలుగుతారని చెప్పిన తత్వవేత్త అన్నారు. అనే ఆశయాలు సమాజంలో బలంగా తీసుకెళ్లి వారు అనుకున్నటువంటి సమ సమాజ స్థాపన లక్ష్యంగా బహుజన్ సమాజ్ పార్టీ వెళుతుందని, వారి విగ్రహాలు కూడా త్వరలో ఎల్లారెడ్డిపేటలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో చేపడతామని వాళ్ళు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి సంజీవ్, మండల ఉపాధ్యక్షులు నాలకంటి లక్ష్మీరాజం, మండల కార్యదర్శిలు అందే ఈశ్వర్, సోషల్ మీడియా ఇంచార్జ్ గడ్డమీది సాయి చంద్, బండి ఉదయ్ పాల్గొన్నారు.