అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం బోనమెత్తిన విశ్వబ్రాహ్మణ పురుషులు. వర్షాలు సమృద్ధిగా కురవాలి చెరువు కుంటలు నిండాలి పాడిపంట పిల్లా జెల్లా ను సల్లంగా చూడాలని కోరుతూ ఎల్లారెడ్డిపేటలో బండ్ల బోనాల పండగ ఆదివారం ఘనంగా జరిగింది, బండ్ల బోనాల సందర్భంగా గ్రామదేవతలైన పోచమ్మ, సార్గమ్మ, పెద్దమ్మ, మీదిప్యాట పోచమ్మ, నాయకమ్మ, శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయం వరకు అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం ఎల్లారెడ్డిపేట విశ్వబ్రాహ్మణ సంఘం ఆద్వర్యంలో పసుపన్నం, బెల్లం అన్నం, పెరుగు అన్నం, వంటలు చేసి బోనం శుద్ధి చేసి బోనం ఆలంకరించి బోనంలో పెట్టి నలుగురు పురుషులు ఎత్తుకోవడం విశేషం. చందనం నిరంజన్, చందనం గోపాల్, తుమ్మనపల్లి సుధాకర్, కాసార్ల స్వామి బోనం ఎత్తారు. వారి తో పాటు కుమ్మరి సంఘం తరపున కుమ్మరులు కూడా మూడు రకాల వంటలు చేసి బోనం శుద్ధి చేసి బోనం ఆలంకరించి కుమ్మరి సంఘం తరపున ఇద్దరు బస్వాపురం చంద్రం, దుంపేట ఆంజవ్వ బోనము ఎత్తి 40 ఎద్దుల బండ్లు ట్రాక్టర్లప వచ్చి గ్రామ దేవతలకు బోనం సమర్పించి గ్రామ ప్రధాన వీధుల గుండా పోచమ్మ గుడి నుంచి శ్రీ రేణుక ఎల్లమ్మ గుడి చేరుకుంటారు. అక్కడినుండి సద్ది ముద్దులవాడ ఆంజనేయస్వామి గుడి వద్దకు చేరుకొని బండ్ల బోనాల ఊరేగింపుకు ముగింపు పలికారు.
బండ్ల బోనాల ఊరేగింపులో మాజీ ఎంపీటీసీ సభ్యులు ఓగ్గు బాలరాజు యాదవ్, రైతు చర్చ మండలి అధ్యక్షులు గుండాడి వెంకట్ రెడ్డి, బండారి బాల్ రెడ్డి, గుండాడి రాంరెడ్డి, రావుల మల్లారెడ్డి , పారిపెల్లి రాంరెడ్డి, పారిపెల్లి సంజీవరెడ్డి, నేవూరి సత్తిరెడ్డి, నేవూరి బాలయ్య గారి గోపాల్ రెడ్డి, సందుపట్ల భగవంత రెడ్డి, శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ చైర్మన్ గడ్డం జితేందర్, అంతేర్పుల గోపాల్, ఇంక్విలాబ్ టీవీ స్టాఫ్ రిపోర్టర్ కట్టెల సాయికుమార్, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు,


