ఎన్టీఆర్: ప్రతిపక్షం అడిగే ఏ ఒక్క ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పడంలేదని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీసెంటర్‌లో చర్చా వేదిక ప్రభుత్వ భజనలా తలపించిందని విమర్శించారు. సీఎం రోడ్‌లో కనీసం వీధి దీపాలైన సరిగా లేవన్నారు. ఇది వాస్తవం కాదా? అని ఆమె ప్రశ్నించారు. 3.5 ఏళ్ల తర్వాత మీరు చూపెట్టిన గ్రాఫిక్స్‌ను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైసీపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.
ప్రజలు నవ్వుకుంటున్నారు
RELATED ARTICLES