ఆరోగ్యమే మహాభాగ్యమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఆదివారం వేములవాడ పట్టణంలోని శ్రీ కృష్ణ వేణి టాలెంట్ స్కూల్ లో హార్ట్ ఫుల్ నెస్ లో భాగంగా శ్రీరామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందర్భంగా మెడిటేషన్ వల్ల కలిగే లాభాల గురించి అవగాహన సదస్సు కార్యక్రమానికి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ఈ సందర్భముగా అది శ్రీనివాస్ మాట్లాడుతూ మెడిటేషన్ అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ అని దీనిని ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఒక అరగంట చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలను పొందుతారని ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆరోగ్యవంతమైన సమాజంతోనే అభివృద్ధి సాధ్యమని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ, పౌష్టికాహారం తీసుకుంటూ, రోగ నిరోధక శక్తిని పెంచుకోవలన్నారు. ధ్యానం చేయడం వలన మనసు ఉల్లాసంగా ఉంటూ మనం దైనందిన జీవితంలో చురుగ్గా ఉంటమన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆరోగ్యనికి పెద్ద పిట వేస్తోందని ప్రజలు రోజు వారి అలవాటుల మార్పులు చేర్పులు చేయడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని అన్నారు.
మారుతున్న ఆహారపు అలవాట్ల వలన ప్రజలు చాలా వరకు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని గతంలో సహజ సిద్ధమైన వనరులను ఉపయోగించి పంటలు పండించే వారని కానీ నేడు మారుతున్న కాలానికి అనుగుణంగా ఎక్కువ మొత్తంలో రసాయనాలు ఉపయోగిస్తున్నారని దీనివలన కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అనేక పరిశోధనలు వెల్లడించాయని గ్రామాల్లో ప్రజలకు ఆరోగ్యం పట్ల చైతన్యం కల్పించేందుకు కళాకారుల చేత ప్రత్యేక ప్రోగ్రాములు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థం మాధవి, వైస్ చైర్మన్ బింగి మహేష్, DM &HO సుమన్ మోహన్ రావు, డాక్టర్లు పద్మాలత, శ్రీనివాస్, శోభారాణి, రజిని, ప్రవీణ్, సంతోష్, టీచర్లు మాధవి, గీతాదేవి, శ్రీరామచంద్ర మిషన్ సభ్యులు కొండం సతీష్ తదితరులు పాల్గొన్నారు..