శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ నిర్మాణానికి 30 లక్షలు సొంతంగా కంట్రిబ్యూషన్ కట్టి, ఆలయ చైర్మన్ గడ్డం జితేందర్ అధ్యక్షతన నిర్మాణ పనులు చేపడుతానని ఆలయ కమిటీ వైస్ చైర్మన్ గంట వెంకటేష్ గౌడ్ స్పష్టం చేశారు. తన స్వంత ప్లాటు అమ్మి గుడి నిర్మాణానికి కంట్రిబ్యూషన్ గా 30 లక్షలు చెల్లించి ఎన్నికల కోడ్ ముగిశాక పనులు తొందరగా చేపట్టి ఆలయాన్ని ప్రజలకు భక్తులకు అందుబాటులో ఉంచుతానని పేర్కొన్నారు. అదేవిధంగా కట్టిన డబ్బులు తిరిగి రిటర్న్ వస్తే శ్రీ వేణుగోపాల స్వామి ఆశీస్సులతో తీసుకుంటా లేదంటే శ్రీ వేణుగోపాల స్వామికి గోవిందా.. గోవిందా.. అని సమర్పించుకుంటానని తెలిపారు. గ్రామస్థులు ఆలయ కమిటీకి సహకరించాలని కోరారు.