రాజన్న సిరిసిల్ల ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి గ్రామానికి చెందిన నెతేట్ల మల్లయ్య(50)అనే వ్యక్తి అప్పుల బాధతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. మల్లయ్య (గురువారం) రాత్రి ఇంట్లో నుండి వెళ్లి ఊరి చివరలో ఉన్న ఓ చెట్టుకు ఉరి వేసుకున్నాడు. ఈ రోజు స్థానికులు చూసి సమాచారం అందించడంతో కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృత్తునికి భార్య కొడుకు ఒక కూతురు ఉన్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.