తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) కరీంనగర్ జిల్లా నాలుగో మహాసభలను జయప్రదం చేయాలని హుజురాబాద్ నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు సౌడమల్ల యోహాన్, అయిత రాధాకృష్ణ, అన్నారు. జమ్మికుంట ప్రెస్ క్లబ్ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ జిల్లా నాలుగో మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 15వ తేదీ ఆదివారం ఎల్ఐసి ఏజెంట్ల భవన్ గణేష్ నగర్ నుండి కోతి రాంపూర్ ఏరియాలో నిర్వహిస్తున్న మహాసభలకు హుజురాబాద్ నియోజకవర్గంలోని వర్కింగ్ జర్నలిస్టులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. మహాసభల్లో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పైన సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్తు కార్యచరణను రూపొందించుకుంటామని అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్లు ఇళ్ల స్థలాలు హెల్త్ కార్డులు రైల్వే పాస్ లను పునరుద్ధరించాలని వారు తెలిపారు. ఈ సమావేశంలో యూనియన్ ఉపాధ్యక్షులు ఏబూసి సంపత్, సహాయ కార్యదర్శి ఎం డి ఖాజా ఖాన్, కోశాధికారి దయ్యాల సుధాకర్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.