గంభీరావుపేట మండలం కొండూరి రాజేశ్వరరావు నగర్ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో రాజేశ్వర్ నగర్ కు చెందిన చిన్నారులు కలిసి క్రికెట్ ఆట ఆడుతున్నారు , అటుగా వెళ్తున్న గాంధీ బాపు చిన్నారులను చూసి తన వాహానాన్ని ఆపి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చిన్నారులతో కలిసి సరదాగా ముచ్చటించారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఉన్న ఖాళీ స్థలంలో పిల్లలతో కలిసి కొద్ది సేపు గాంధీ బాపు సరదాగా బ్యాటింగ్ చేత బట్టి క్రికెట్ ఆడారు,
గాంధీ బాపు తన బ్యాటింగ్‌తో పిల్లలను ఎంతగానో అలరించాడు. చిన్నారులతో కలిసి సమయం గడిపిన పాఠశాల ఆవరణలో పిల్లలతో కలిసి క్రికెట్ ఆడారు.
ఈ సందర్భంగా చిన్నారులు మీతో పోటో దిగుతామని కోరగా వారి కోరిక మేరకు గాంధీ బాపు వారితో కలిసి గ్రూప్ పోటో దిగారు , కొందరు చిన్నారులు గాంధీ బాపుతో సెల్ఫీలు కూడా దిగారు. ఈ సందర్భంగా చిన్నారులకు గాంధీ బాపు క్రికెట్ కిట్టు తన స్వంత ఖర్చులతో కొని ఇచ్చారు, చిన్నారులకు ఆల్ ది బెస్ట్ తెలిపారు,
ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పిట్ల వెంకటి , బాలయ్య, ఆనందం , నారాయణ లు పాల్గొన్నారు ,