రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన తుడుం రవళి అజయ్ దంపతుల కుమారుడు హనీష్ (30) నెలలు విష జ్వరం వచ్చింది. మంగళవారం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు పరీక్షించి మెరుగైన వైద్యం కొరకు కరీంనగర్ తీసుకెళ్లాల్సిందిగా సూచించడంతో వెంటనే కరీంనగర్ ప్రతిమ ఆస్పత్రికి తరలించగా అక్కడి వైద్యులు బాలుడిని పరీక్షించగా అప్పటికే మృతి చెందాడని పేర్కొన్నారు. ఒక్కసారిగా ఆ కుటుంబంలో రోదనలు మిన్నంటాయి. సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో వెంటిలేటర్ ఉంటే తమ కొడుకు బ్రతికేవాడని పేర్కొన్నారు. మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ బాలుడి పార్థివదేహాన్ని చూసి విచారం వ్యక్తం చేస్తూ పేద ప్రజల కొరకు ఏర్పాటుచేసిన ఏరియా ఆసుపత్రిలో వెంటిలేటర్ లేకపోవడం బాధాకరమని వెంటిలేటర్ ఉంటే తమ బాలుడు బ్రతికేవాడని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.