జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని మహిళా సంఘ సభ్యులకు, వార్డ్ ప్రజలకు తడి, పొడి చెత్తపై మున్సిపల్ కమీషనర్ మహమ్మద్ అయాజ్, వార్డ్ కౌన్సిలర్ రావికంటి రాజు లు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా కమీషనర్ మహమ్మద్ అయాజ్ మాట్లాడుతూ వార్డులలోని ప్రజలు, సంఘ సభ్యులు చెత్తను వేరుచేయాలని తడిచెత్త, పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనానికి అందించాలని మున్సిపాలిటీ పరిధిలో 17 చెత్త సేకరణ వాహనాలు వార్డులలో నడుస్తున్నాయన్నారు. రాష్ట్రంలో ఇంటి పన్ను వసూళ్ళలో జమ్మికుంట 5వ ర్యాంక్ సాధించిందని, రానున్న రోజుల్లో చెత్త సేకరణలో కూడా జమ్మికుంట మున్సిపాలిటీ మంచి ర్యాంక్ సాధించాలని సంఘ సభ్యులను, వార్డ్ ప్రజలను కోరారు. కూరగాయలు, కిరాణ సామాన్లు కొనేందుకు వెళ్ళేటప్ప్పుడు ప్లాస్టిక్ కవర్లు కాకుండా జ్యూట్ బాగ్స్ ఉపయోగించాలని నీరు నిల్వ ఉన్న చోట ఎప్పటికప్పుడు నీరును పారబోయలని లేనియెడల దోమలు వ్యాప్తి చెంది, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ మహేష్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ శ్రీకాంత్, సీఎల్ఆర్పీలు జ్యోతి, మంజుల, ఆర్పీలు అబేధభాను, మల్లీశ్వరి, రజితలతో పలువురు సంఘ సభ్యులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు..