ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్ల పేట గ్రామ శివారులోని కోళ్ల ఫారం సమీపంలో గంభీరావుపేట మండలం నర్మల గ్రామానికి చెందిన బి.ఎస్.పి గంభీరావుపేట మండల అధ్యక్షులు కర్రోల్ల రాజు ( 40 ) గురువారం రాత్రి 8-30 గంటల సమయంలో ద్విచక్ర వాహనం పై వస్తుండగా అదుపు తప్పి కిందపడి అక్కడికక్కడే మరణించారు. గంభీరావుపేట మండలం నర్మాల గ్రామానికి చెందిన కర్రోల్ల ఎల్లవ్వ అను ఆమె పోలీస్ స్టేషన్లకు వచ్చి ఇచ్చిన తన కుమారుడు కర్రోల రాజు, తేదీ 16.05.2024 రోజున సమయం మధ్యాహ్నం 02:30 గంటలకు తన బైకు పై ఇంటి వద్ద నుండి పని నిమిత్తం బయటకు వచ్చినాడని నిన్న గొల్లపల్లి గ్రామానికి వచ్చి రాత్రి 8:00 గంటల సమయంలో పండ్లు తీసుకొని తిరిగి బండిపై ఇంటికి వెళుతున్న క్రమంలో మార్గం మధ్యలో గల కొరట్లపేట గ్రామ శివారులో గల ఎల్లమ్మ దేవాలయం వద్ద గల రోడ్డు మలుపు వద్ద మృతుని బైకు అదుపుతప్పి ప్రమాదవశాత్తు రోడ్డు పక్కన గల చెట్టుకు గుద్దుకొని మృతుడు కిందపడి తనకు బలమైన రక్త గాయంల వల్ల అక్కడికక్కడే మరణించినాడని ఎస్ ఐ రామాకాంత్ కు ఇచ్చిన దరఖాస్తులో పేర్కొంది. శుక్రవారం ఉదయం 08:00 గంటల సమయంలో కోరుట్లపేట గ్రామానికి చెందిన వారు చూసి చెప్పగా, మృతుని కుటుంబ సభ్యులు వచ్చి చూసి, తన కొడుకు మరణం పై ఎలాంటి అనుమానం లేదని పిఎస్ కు వచ్చి దరఖాస్తు ఇవ్వగా, ఎస్ఐ ఎన్. రమాకాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. పోస్ట్ మార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించి అనంతరం మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులకు అప్పగించగా అతని కుటుంబ సభ్యులు బంధుమిత్రులు గ్రామంలోని స్మశాన వాటికలో అంత్యక్రియ నిర్వహించారు, అతనికి భార్య, కూతురు, తల్లి ఉన్నారు ,
![](https://inquilabtv.com/wp-content/uploads/2024/05/H-1-1024x486.jpeg)