రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షునిగా ఎడ్ల సందీప్ ఎన్నికయ్యారు. ఎల్లారెడ్డిపేట స్థానిక జెడ్పిటిసి కార్యాలయంలో శుక్రవారం మండల బీఆర్ఎస్ అధ్యక్షులు వరుస కృష్ణ హరి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు పాల్గొనగా ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య హాజరయ్యారు. పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు గా ఎడ్ల సందీప్ ను ఏకగ్రీవంగా ఎన్నుకొని నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎడ్ల సందీప్ మాట్లాడుతూ తనకు ఇచ్చిన బాధ్యతలు తూచా తప్పకుండా పాటిస్తానని పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని గులాబి సైనికునిగా పోరాడుతానని రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఎల్లారెడ్డిపేట నుండి భారీ మెజారిటీ తీసుకువచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని తన ఎన్నికకు సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, నాయకులు మీసం రాజం, పందిర్ల పరుశరామ్ గౌడ్, అజ్జు, బందారపు బాల్ రెడ్డి, పిల్లి కిషన్, ఎనగందుల నరసింహులు, శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.