విజయనగరంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ట్రాఫిక్ ఏఎస్ఐ పై ఆయుధంతో దాడి చేశాడో మందు బాబు. దాదాపు రెండుగంటల నుండీ ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ట్రాఫిక్ పోలీస్ బీట్ వద్దే ఫుల్ గా మద్యం సేవించి ఓ వ్యక్తి రోడ్ పైనే పడిపోయాడు. ట్రాఫిక్ రద్దీ ఉన్న సమయంలో మద్యం సేవించి ఓ వ్యక్తి రోడ్ కు అడ్డంగా పడి ఉండటాన్ని”ఇంక్విలాబ్. టీవీ”ప్రతినిథి గమనించి హుటాహుటిన ట్రాఫిక్ ఏఎస్ఐ రామకృష్ణ కు సమాచారం అందించగా ఆయన తన బృందంతో ఆ మందుబాబును అక్కడ నుంచీ తొలగించేందుకు యత్నించగా చేతిలో ఉన్న రాడ్ తో ఏఎస్ఐ పైనే దాడి చేయబోయాడు. వెంటనే ప్రతిఘటించి తన ఇద్దరు పీసీలైన గోవింద్, శ్రీనుల సహాయంతో సమీపంలోని ఐనాక్స్ వద్దకు ఎత్తుకుని వెళ్లి కూర్చోబెట్టి అక్కడ స్తంభించిన ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు.
ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ట్రాఫిక్ ఏఎస్ఐ పై మందుబాబు దాడి…!
RELATED ARTICLES