ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ఈ-చలానా పని చేయకపోవడంతో చాలా చోట్ల, చాలా ప్రాంతాల్లో అటు ట్రాఫిక్ ఇటు రోడ్ రవాణ శాఖలు ఫైన్ లు వేయలేకపోవడంతో విచ్చల విడిగ వాహనాలు అదీ లైసెన్స్, సి బుక్ లేకండా విజయనగరంలో రోడ్ మీదకు రావడం షరా మామూలైంది. అయితే కేంద్ర ప్రభుత్వం స్వయంగా ఆ లోటును గుర్తించి తన ఆధీనంలోన కొత్తగా కేంద్ర రవాణ శాఖ ఆధ్వర్యంలో ఈ-చలానా పద్దతి తీసుకొచ్చింది. తద్వారా విజయనగరం ట్రాఫిక్ పోలీసులు ఈ రోజు గంటస్థంభం వద్ద వాహనాల చెకింగ్ చేశారు. ఈ క్రమంలో ట్రాఫిక్ ఎస్.ఐ. G. త్రినాధ్ రావు ఉన్నతాధికారుల ఆదేశాలతో బైక్స్ తనిఖీ చేసి కేవలం ఒక్క రోజు లో రమారమి 40 వాహనాలపై ఈ చలనా ద్వారా ప్రభుత్వానికి సుమారు 45 వేలు నగదును కట్టించారు. దీంతో విజయనగరంలో కార్పొరేషన్ ప్రజలు శభాష్ ట్రాఫిక్ పోలీస్ అని అనడం విశేషం.
గంటస్థంభం సాక్షిగా సుమారు 60వాహనాలపై కేసులు.. ప్రభుత్వానికి 40వేల నగదు జమ
RELATED ARTICLES