Tuesday, December 16, 2025
spot_img
HomeTELANGANA9వ రోజు చెవులో పువ్వులు పెట్టుకొని నిరసన చేస్తున్న తాజా మాజీ సర్పంచులు

9వ రోజు చెవులో పువ్వులు పెట్టుకొని నిరసన చేస్తున్న తాజా మాజీ సర్పంచులు

సర్పంచులకు రావాల్సిన పెండింగ్ బిల్లులు తక్షణమే విడుదల చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యవర్గ కమిటీ మరియు బోయినిపల్లి, వేములవాడ మండల సర్పంచులందరూ చేస్తున్న రిలే నిరాహారదీక్ష 9వ రోజుకు చేరుకుంది. 28వ తారీకు వరకు మా పెండింగ్ బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకుంటే, మేము తీసుకున్న ఏ కార్యక్రమానికైనా ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని, గ్రామాలను అభివృద్ధి చేసి అధికారులతో MB రికార్డు చేసుకొని ఉన్న సర్పంచుల పెండింగ్ బిల్లులు ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బహుజన సేన ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షులు జింక శ్రీధర్, గ్రామపంచాయతీ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు సుధాకర్, జిల్లా అధ్యక్షులు, మల్యాల నరసయ్య, జిల్లా కార్యదర్శి అన్నల్ దాస్ గణేష్, దీక్ష శిబిరానికి వచ్చి మద్దతు తెలిపారు. వీరికి రాజన్న సిరిసిల్ల జిల్లా తాజా మాజీ సర్పంచ్ల JAC కమిటీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అక్కెనపల్లి కరుణాకర్, ఉపాధ్యక్షులు గణుప శివజ్యోతి, కార్యదర్శిలు, గున్నాల లక్ష్మణ్, గాండ్ల సుమతి, కీర్తి రెడ్డి వెంకట నరసింహారెడ్డి, బూర్గుల నందయ్య, దోమకొండ ఎల్లం, తాడేపు ఎల్లం, రవి నాయక్, కోల నరసయ్య , సిరికొండ శ్రీనివాస్ తదితర జిల్లా సర్పంచులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments