కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలో దారుణం నాటు వైద్యం పేరుతో (10) పదేళ్ల బాలుడిని బలిగొన్న ఘటనా మూడేళ్ల తర్వాత గురువారం వెలుగులోకి వచ్చింది. డీఎస్పీ సదయ్య తెలిపిన వివరాల ప్రకారం రెబ్బెనలోని నంబాల గ్రామానికి చెందిన మల్లీశ్వరి (10)పదేళ్ల కుమారుడు రిషి కొన్నేళ్ల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతన్ని పట్టుకుని మూడేళ్ల క్రితం రెబ్బెన మండలంలోని పాసిగాం గ్రామంలోని పూలాజీ బాబా ధ్యాన కేంద్రానికి వెళ్లి నాటు వైద్యం కోసం బామినే భీంరావుకు చూపించారు. తనకే నాటు వైద్యం వస్తుందని నమ్మబలికి చెట్ల మందులతో మీ అబ్బాయి ఆరోగ్యాన్ని పూర్తిగా నయం చేస్తానని, రిషిని ఆశ్రమంలో వదిలేసి వెళ్లాలని చెప్పాడు. భీంరావు మాయ మాటలు నమ్మి తల్లి మల్లీశ్వరి రిషిని ఆశ్రమంలో వదిలేసి వెళ్లింది. కొన్ని రోజుల తర్వాత రిషి కోలుకోవడానికి మల్లీశ్వరి ఆశ్రమానికి వెళ్ళిగా నీ కొడుకు బయట పని ఉండి వెళ్లాడు. సాయంత్రం వరకు వస్తారని చెప్పి ఆమెను భీంరావ్ తిరిగి పంపాడు. ఆశ్రమానికి వెళ్ళిన ప్రతి సారి కొడుకుని చూపించకుండా భీంరావు ఎదో ఒక సాకు చెప్పి మూడేళ్లుగా తనను తీప్పించుకుంటున్నాడని, మల్లీశ్వరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసి భీంరావును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. రిషి నాటు వైద్యంతో ఆరోగ్యం క్షీణించి చనిపోవడంతో భయంతో తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా రిషి మృతదేహాన్ని ఆశ్రమం వెనకాల పొలంలో పాతి పెట్టినట్లు విచారణలో వెల్లడించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. అయితే రిషి ఆరోగ్యం క్షీణించి మృతి చెందాడా.. లేక హత్య చేయబడ్డాడ.. అని తెలుసుకొనేందుకు ఫోరెన్సిక్ నిపుణులతో రీ పోస్టుమార్టం చేసేందుకు గురువారం రెబ్బెన తహసీల్దార్ సమక్షంలో పాతి పెట్టిన చోట నుండి తవ్వి ఎముకలు వెలికి తీశారు.