నిధులు మంజూరై ఏడాది గడుస్తున్నా రోడ్డు నిర్మాణంలో జాప్యాన్ని నిరసిస్తూ కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం రాంపూర్ గ్రామ ప్రజలను కలుపుకొని నిరసన తెలిపిన డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు చాపిడి పురుషోత్తం. ఆయన మాట్లాడుతూ 20 సంవత్సరాలు గడుస్తున్నా ఎన్ని ప్రభుత్వాలు మారినా రాంపూర్ గ్రామానికి బీటీ రోడ్డు లేనటువంటి పరిస్థితి ఉందని గత సంవత్సరంలో ఒక కోటి నలభై లక్షలు విడుదలైనప్పటికీ పనులలో జాప్యం జరగడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అదే సమయంలో నిరసన తెలుపుతున్నా క్రమంలో సిర్పూర్ ఎస్సై డికొండ రమేష్ వచ్చి కాంట్రాక్టర్ కు ఫోన్ చేసి పనుల జాప్యంపై అడుగగా కాంట్రాక్టర్ తెలిపినటువంటి సమస్య ఏమిటంటే పనులు ప్రారంభం చేసింది నిజమే కానీ తర్వాత రెబ్బెన zptc ఫోన్ చేసి ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టిన తర్వాత రోడ్డు పనులు ప్రారంభించాలి. అనడంతో ఆపివేశారని అన్నారు. రోడ్డు పనులు ఆపడానికి గల కారణం జడ్పిటిసి అని తెలుసుకున్న గ్రామ ప్రజలు జడ్పిటిసి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయం తెలిసినా కానీ కొబ్బరికాయ కొట్టడం ముఖ్యమనే ఆలోచన సరికాదన్నారు. రాజకీయం చేయడం తగదని వారన్నారు. పనులు వెంటనే ప్రారంభించాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున జడ్పిటిసి కార్యాలయం ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు చల్లూరి వంశి, చాపిడి శివ, కృష్ణ రాంపూర్ గ్రామస్తులు పాల్గొన్నారు.