తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) హుజురాబాద్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం జమ్మికుంట పట్టణంలోని ప్రెస్‌క్లబ్ కార్యాలయంలో ముస్లీం పాత్రికేయులు, అధికారులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఉపవాస దీక్షలు ఆచరించే ముస్లిం సోదరులకు ఇచ్చే ఇఫ్తార్ విందు మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. పాత్రికేయులు అంటే కేవలం సమాజంలోని సమస్యల పట్ల జవాబుదారిగా ఉండటమే కాకుండా అన్నీ మతాలను గౌరవిస్తూ ఉంటామని జమ్మికుంట జర్నలిస్టులు ఈ సందర్భంగా వెల్లడించారు. ఇఫ్తార్ విందుకు జమ్మికుంట మున్సిపల్ కమిషనర్, మహమ్మద్ అయాజ్ జమ్మికుంట టౌన్ సీఐ వి.రవి, ఎస్ బీ అలీం పాష హాజరయ్యారు. వారు మాట్లాడుతూ గతంలో ఎప్పుడు లేని విధంగా జమ్మికుంట పట్టణ విలేకరులు ఈ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. పవిత్ర మాసంలో ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొనడం సంతోషంగా ఉందని వెల్లడించారు. కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ హుజురాబాద్ డివిజన్ కమిటీ అధ్యక్షులు సౌడమల్ల.యోహాన్, కార్యదర్శి రాధాకృష్ణ, జాయింట్ సెక్రటరీ ఖాజా ఖాన్ కమిటీ సభ్యులు మరియు ఇంక్విలాబ్ న్యూస్ ఛానల్ రిపోర్టర్ ఎండీ రఫీక్ పాత్రికేయులు పాల్గొన్నారు.