Wednesday, January 22, 2025
spot_img
HomeTELANGANAఈతకు వెళ్లి పదవ తరగతి విద్యార్థి మృతి

ఈతకు వెళ్లి పదవ తరగతి విద్యార్థి మృతి

కంచర్లలో విషాదం. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం కంచర్ల గ్రామానికి చెందిన కొమిరే హరికృష్ణ (16 ) అనే పదో తరగతి విద్యార్థి ఈతకు వెళ్లి ఈత రాకపోవడంతో అల్మాస్పూర్ శివారులోని రంగం చెరువులో గురువారం మరణించాడు, కంచర్ల గ్రామానికి చెందిన వడ్డెర కులానికి చెందిన కొమిరే హారి కృష్ణ, కొమిరే రాకేష్ లు ఇద్దరు విద్యార్థులు కలిసి ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ గ్రామ శివారులోని రంగం చెరువు వద్దకు ఈతకు వెళ్ళారు. హరికృష్ణతో వెళ్లిన మరో విద్యార్థి రాకేష్ బహిర్భూమికి వెళ్లి కాలకృత్యాలు తీర్చుకొని తిరిగి చెరువులో ఈత కొట్టడానికి వచ్చేలోపు హరికృష్ణ చెరువు నీటిలో దూకాడు అతనికి ఈత రాకపోవడంతో అదే నీటిలో మునిగి మరణించాడు,
దీంతో భయందోళనలకు గురైన రాకేష్ వెంటనే కంచర్ల గ్రామానికి వెళ్లి ఈ విషయం అతని కుటుంబ సభ్యులకు ఇతరులకు గ్రామస్తులకు తెలపడంతో వారు హుటాహుటిన రంగం చెరువు వద్దకు చేరుకొని నీటిలో మునిగి మరణించిన హరికృష్ణ మృతదేహాన్ని కంచర్ల గ్రామస్తులు కొందరు నీటి నుంచి ఒడ్డుకు చేర్చారు. హరికృష్ణ మృత దేహాన్ని చూసి తల్లిదండ్రులు లక్ష్మీ, వెంకటి సోదరుడు రాజ్ కుమార్ బంధుమిత్రులు బోరున విలపించారు,
పదవ తరగతి పరీక్ష మొన్ననే రాస్థివిగదా బిడ్డ వాటి ఫలితాలు కూడా రాకపాయే మరణిస్తివి బిడ్డా అంటూ వారు కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో ఆ ప్రాంతమంతా శోకసముద్రమయ్యింది. ఈ సంఘటనతో కంచర్లలో విషాదం అలుముకుంది. ఎల్లారెడ్డిపేట పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం హరికృష్ణ మృతదేహాన్ని సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం హారికృష్ణ మృతదేహాన్ని కంచర్ల గ్రామానికి తరలించి గురువారం రాత్రి వరకు అంత్యక్రియలు నిర్వహించడానికి వడ్డెర కులస్తులు ఏర్పాట్లు చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments