గంగిగోవు పాలు గరిటెడైనను చాలు… కడివెడైననేమి ఖరము పాలు’ అన్నది వేమన కాలం మాట! ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయింది. గాడిద పాల డిమాండ్ తెలిస్తే ఆ గాడిదల్ని పెంచుకునే వాళ్లనే తోపుల్లా చూస్తారు. లీటర్ గాడిద పాలు ఏడు వేల రూపాయల వరకు ఉంటోంది. గాడిద పాలకు ఇంత గిరాకీ ఎలా వచ్చిందని షాక్ అవుతున్నారా? అవును మరి.. వాటిలో అంత మేటర్ ఉందని సైంటిస్టులే బల్ల గుద్ది చెబుతున్నారు. అందాన్ని పెంచడం మొదలు ఆరోగ్యాన్ని నిలబెట్టడం వరకు ఎంతో మేలు చేస్తాయి గాడిద పాలు అంటున్నారు.
ఎప్పుడో క్రీస్తు పూర్వం ఈజిప్టును పాలించిన రాణి క్లియో పాత్ర. ఇప్పటికీ అందానికి కేరాఫ్ అడ్రస్‌గా ఆమెనే చెబుతారు. అప్పట్లో తన బ్యూటీని కాపాడుకోవడానికి గాడిద పాలతో స్నానం చేసేదట. దాదాపు రెండు వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పటికి గాడిద పాల పవర్‌ని గుర్తించారు. ఇప్పుడు వీటి గిరాకీ ఒక్క బ్యూటీ ప్రొడక్టులకే పరిమితం కాలేదు. గతంలో ఎలాగైతే ఆవు పాలను అమృతంగా చెప్పుకునేవాళ్లో.. ఇవాళ అంతకు మించి గాడిద పాలను సూపర్ గుడ్ ఫుడ్‌గా చెబుతున్నారు. గరిటెడు అయినా గాడిద పాలు తాగాల్సిందే అంటున్న
రోగ నిరోధకశక్తిని పెంచే బెస్ట్ మిల్క్
గాడిద పాలు లో– ఫ్యాట్ ఫుడ్ అని తేలింది. మంచి న్యూట్రిషనల్ బెనిఫిట్స్ దీని సొంతమని ఐక్య రాజ్య సమితిలోని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆరనైజేషన్ (ఎఫ్ఏవో) ప్రకటించింది. రోగ నిరోధక శక్తిని పెంచే మెడిసినల్ వ్యాల్యూస్ కూడా గాడిద పాలలో ఉన్నాయి. విటమిన్లు, ఎసెన్షియ్ ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఆవు, గేదె పాలు తాగితే పడని పసి పిల్లలకు ఇది బెస్ట్ ఆల్టర్నేటివ్. బర్రె పాలు పట్టిస్తే అజీర్తి వంటి ఇబ్బందులు వస్తున్న పిల్లలకు గాడిద పాలు పట్టించడం బెస్ట్ అని ఎఫ్ఏవో చెప్పింది. పెద్ద వాళ్లకు కూడా మంచి పోషకాహారంగా గాడిద పాలు ఉపయోగపడతాయి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని కణాలను రక్షించడంలో కీ రోల్ ప్లే చేస్తాయి. పొగ, రేడియేషన్ వల్లే సగం రోగాలు వస్తాయి. గుండె జబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలు, బ్రెయిన్ స్ట్రోక్, కేన్సర్.. ఇలా ఒకటేంటి సకల రోగాలకు మూలం ఇవే. పొగ, రేడియేషన్ వల్ల మన శరీరంలోకి ఫ్రీ రాడికల్ సెల్స్ ప్రవేశించి ఆరోగ్యంగా ఉన్న కణాలను బ్రేక్ చేస్తాయి. దీని వల్లే ప్రాణాంతక రోగాలు వచ్చిపడతాయి. ఈ పరిస్థి తి రాకుండా ఉంచడంలో యాంటీ ఆక్సిడెంట్స్‌దే కీలక పాత్ర. శరీరంలోని కణాలను ప్రొటెక్ చేట్ స్తూ రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్‌కు గాడిద పాలు బెస్ట్ సోర్స్ అని పరిశోధనల్లో వెల్ల డైంది.
కేరళలో ‘ఇన్నొవేటివ్ రిఫార్మర్’
ఆయుర్వేదం, మూలికా వైద్యాలకు కేరళఎప్పటి నుంచో ఫేమస్ అన్న విషయం తెలిసిందే. ఇదే దారిలో గాడిద పాల గొప్పదనాన్ని గుర్తించడంలోనూ కేరళ ముందుంది. ఆ రాష్ట్రానికి చెందిన ‘అబే బేబీ’ అనే రైతు ఐదారేళ్ల క్రితమే గాడిదల పెంపకం మొదలుపెట్టాడు. కొచ్చి సమీపంలోని రామమంగళం గ్రామంలో తన రెండెకరాల పొలంలో 27 గాడిదలను ఫామ్ నడుపుతున్నాడు. వాటిలో కొన్ని ఫ్రాన్స్‌కు చెందిన పోయిటోవ్ జాతి గాడిదలు కూడా ఉన్నాయి. డాల్ఫిన్ ఐబీఏ పేరుతో కంపెనీ పెట్టి గాడిద పాల మార్కెటింగ్ స్టార్ట్ చేశాడు. 2019 టార్ట్ సంవత్సరంలో ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ అందించే ఇన్నొవేటివ్ఫార్మర్ అవార్డు సొంతం చేసుకున్నాడు.
మన దగ్గరే ఆలస్యం
గాడిద పాలను గుర్తించడంలో మనమే కొంత వెనుకబడ్డాం . అమెరికాతో పాటు కొన్ని ఇతర దేశాల్లో ఇప్పటికే గాడిద పాలను రోజువారీగా తాగుతున్నారు. ఇంకా మన దగ్గర వాటిని తాగడానికి పనికొచ్చే పాలలా చూడట్లేదు. బ్యూటీ ప్రొడక్స్ ట్ తయారీలో బాగానే వాడుతున్నా అతి కొద్దిప్రాంతాల్లోనే రెగ్యులర్ మిల్క్ కేటగిరీలో చూస్తున్నారు. కొచ్చి, పుణె, ఘజియాబాద్‌లాంటి ప్రాంతాల్లో అతికొద్ది మంది రైతుల గాడిద డెయిరీ ఫామ్స్ మొదలుపెట్టి తమ సొంత బ్రాండ్స్‌తో సేల్స్ చేస్తున్నారు. లీటరు రూ.3 వేల నుంచి 7 వేల వరకు అమ్ముతున్నారు. అమూల్ లాంటి పెద్దడెయిరీ సంస్థలు ఈ బిజినెస్లోకి ఎంట్రీ ఇస్తే ప్రజలందరికీ తక్కువ రేటులో పాలు అందుబాటులో ఉండొచ్చని అంటున్నారు. అయితే ఈ పాల లైఫ్ 7 నుంచి- 8 గంటలు మాత్రమే ఉంటుంది. ఎక్కువ టైం స్టోర్ చేసుకునేలా రీసెర్చ్ జరగాలి.
సోరియాసిస్ కు
యాంటీ ఏజింగ్ కాస్మొటిక్స్‌లో గాడిద పాలకు మంచి డిమాండ్ ఉంటుందని ఐసీఏఆర్ నేషనల్ రీసెర్చ్సెంటర్‌లోని సైంటిస్టుల టీం చెప్తోంది. ‘‘చర్మంపై ముడతలు రాకుండా మృదువుగా ఉంచడంలో గాడిద పాలలోని పాలీ అన్ శాచ్యురేటెడ్ యాసిడ్స్, రీ–జనరేటింగ్ కాంపౌండ్స్ పనికొస్తాయి. గాడిద పాలతో ఆయుర్వేద వైద్య విధానంలో సోరియాసిస్ లాంటి చర్మ వ్యాధులకు మందు కనుక్కోవచ్చ’’ని చెబుతున్నారు సీనియర్ సైంటిస్ట్ అనురాధా భరద్వాజ్
హార్మోన్ల సమస్యలకూ మందు గ్యాస్ట్రిక్ సమస్యలు, స్కిన్ అలర్జీలు ఉన్నవారికి ఈ పాలు చాలా మంచిదంటాడు బేబీ. ‘‘బ్యూటీప్రాడక్ట్ ఇప్పటికే తయారుచేశాం. మెడిసినల్ ఫుడ్స్ కూడా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. ఇప్పటికే బ్యూటీ ప్రాడక్స్ తయారు చేసి సేల్స్ మొదలు పెట్టేశాం.సోరియాసిస్ కు 88గ్రాముల స్కిన్ క్రీమ్ ప్యాక్రూ.4,840, ఫెయిర్‌నెస్ క్రీమ్లు రూ.6 వేలు,షాంపూలు రూ.2,500 రేట్లు ఉన్నాయి. 2017నుంచి బిజినెస్ బాగా పెరిగింది. గత ఏడాది టర్నోకోటి దాటింది’’అని చెప్పాడు బేబీ.
ఆ పనిలోనే ఉన్న ప్రభుత్వం
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్) గాడిద పాలపై స్టడీ చేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ ప్రకటించింది. హర్యానాలోని హిస్సార్‌లో ఉన్న ఐసీఏఆర్ నేషనల్ రీసెర్చ్సెంటర్‌లో పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రత్యేకించి గుజరాత్‌లో లభించే ‘హలారి’ జాతికిచెందిన గాడిదల పాలల్లో మెడిసినల్ వ్యాల్యూస్ ఉన్నట్లు సైంటిస్టులు గుర్తించారు. మందులు, బ్యూటీ ప్రొడక్ట్స్ తయారీలో గాడిదపాలు ఉపయోగపడతాయని, రైతులను ఎంకరేజ్ చేస్తే మంచి అగ్రి బిజినెస్ క్రియేట్ అవుతుందని ఐసీఏఆర్ అభిప్రాయపడింది. గాడిద పాల డెయిరీ రంగానికి కేంద్ర ప్రభుత్వం అప్రూవల్స్ ఇస్తే దీన్ని అందిపుచ్చుకునేందుకు పెద్దపెద్ద వ్యాపార సంస్థలు రెడీగా ఉన్నాయి. హిస్సార్‌లో గాడిదల డెయిరీ ఫామ్ పెట్టేందుకు స్థానిక ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఐసీఏఆర్ సహకారంతో హలారి గాడిదల బ్రీడింగ్, ఆ తర్వాత డెయిరీ పనులు మొదలుపెట్టాలని కొన్ని డెయిరీ రీసెర్చ్ సంస్థలు ప్రయత్నాల్లో ఉన్నాయి.